Hairs Demond In Other Countries : కోరిన కోర్కెలు తీరాయని లేకపోతే మొక్కు కోసం చాలామంది దేవుడి సమక్షంలో గుండు కొట్టించుకుంటారు. అలా అక్కడ గుండు కొట్టించుకుంటున్నప్పుడు చాలా తల వెంట్రుకలు ఉంటాయి. వీటిని చూసినప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది. ఇలా మనం మొక్కుగా తీర్చుకున్న జుట్టుతో వీళ్లు ఏం చేస్తారు. అసలు ఈ జుట్టు వల్ల లాభం ఏమైనా ఉందా? ఇవి వ్యర్థమేనా అని సందేహ పడతారు. అయితే దేవుడి సన్నిధిలో ఇచ్చే జుట్టు కానీ, సాధారణ తల వెంట్రుకలతో కానీ కోట్లు సంపాదించవచ్చు. పట్టణాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంటింటికి వెళ్లి జుట్టు ఉందా అని అడుగుతారు. వాటిని తుకవతో కొలిచి ఎంత బరువు ఉంటే దానికి తగ్గట్లు డబ్బులు ఇస్తారు. జుట్టు వృథా అని అందరూ అనుకుంటారు. కానీ తల వెంట్రుకలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది తల వెంట్రుకలతో బిజినెస్ చేసి కోటీశ్వరులు అవుతున్నారు. మరి ఇంత డిమాండ్ ఉన్న తలవెంట్రుల స్టోరీ ఏంటి? విదేశాల్లో ఈ జుట్టుతో ఏం చేస్తారు? ఎందుకు అసలు వీటికి అంత డిమాండ్? ఈరోజు మన ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రతి ఏడాది ఇండియా నుంచి కోట్లలో తలనీలాల బిజినెస్ జరుగుతుంది. దాదాపు 4 మిలియన్ డాలర్ల తల వెంట్రుకలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తల వెంట్రుకలు కిలోకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఉంటుంది. అది కూడా జుట్టు నాణ్యత బట్టి ఉంటుంది. తల వెంట్రుకలు నాణ్యతగా ఉండి దృఢంగా ఉంటే రూ.20 వేల నుంచి 25 వేల వరకు ధర పలుకుతుంది. అలాగే జుట్టు పొడవు బట్టి కూడా రేటు విషయంలో మార్పులు ఉంటాయి. ఈ తల వెంట్రుకలను కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ఇలా పెద్ద నగరాల నుంచి మార్కెట్ జరుగుతుంది. అక్కడ నుంచే వీటిని విదేశాలకు కొనుగోలు చేస్తారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ.. వ్యాపారులు కోట్ల రుపాయలు సంపాదిస్తున్నారు. ఈ తల వెంటుకలను ఎక్కువగా చైనా విక్రయిస్తోంది. అలాగే గుజరాత్ తల వెంట్రుకలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే గుజరాత్ వాళ్ల తల వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉండటం వల్ల వీటి గిరాకీ పెరిగింది.
వ్యాపారులు ఈ జుట్టుని శుభ్రం చేసి ఓ రసాయనంలో ఉంచుతారు. వీటిని వివిధ దేశాలకు సరఫరా చేస్తారు. జుట్టుకు ఎలాంటి రంగు లేకుండా నాణ్యతగా ఉన్న దాన్నే ఎక్కువగా ఎగుమతి చేస్తారు. విదేశాల్లో ఈ జుట్టుతో విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లకు ఉపయోగిస్తారు. విదేశాల్లో ఫ్యాషన్ ఫాలో అయ్యేవాళ్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తారట. అందుకే వీటికి అక్కడ బాగా డిమాండ్ ఉంది. భక్తులు ఎంతగానో నమ్మిన తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి ఈ తలనీలాల వల్ల ఆదాయం పెరుగుతోంది. ప్రతి ఏటా ఈ తలనీలాల వల్ల దాదాపు రూ.150 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఈ తలనీలాలను గ్రేడ్‌లుగా విభజించి వేలం వేస్తారు. అందులో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. మన మొక్కుగా ఇచ్చిన తల వెంట్రుకలు దేవుడికి ఆదాయాన్ని ఇస్తున్నాయి.