https://oktelugu.com/

Before Romance Wife And Husband : అనుభూతి చెందాలంటే.. కలయిక ముందు భార్యాభర్తలు ఈ నియమాలు పాటించాలి

భార్యాభర్తలు శృంగారం చేసే ముందు అసలు ప్లానింగ్ లేకుండా చేస్తారు. కలయిక ముందు భార్యభర్తలు కొన్ని నియమాలను పాటిస్తే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శృంగారం ఒక మెమోరీగా గుర్తుంటుందట. మరి కలయిక ముందు పాటించే ఆ నియమాలేంటో తెలుసుకుందామా.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 27, 2024 5:04 pm

    Roamance

    Follow us on

    Before Romance Wife And Husband : భార్యాభర్తల మధ్య శృంగారం అనేది చాలా ముఖ్యమైనది. ఇద్దరు సంతోషంగా ఉండటంతో పాటు బంధం బలపడాలంటే శృంగారం అనేది తప్పనిసరి. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు ఉన్నా సరే.. శృంగారం ఇద్దరిని ఒకటి చేస్తుంది. భార్యాభర్తలు అన్నాక మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అయితే ఫిజికల్ లైఫ్ లేకపోతే ఇద్దరి మధ్య బంధం కూడా అంతగా బలపడదు. ఆందోళన, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం బాలేకపోయిన కూడా శ‌ృంగారం అన్నింటిని బాగుచేస్తుంది. అయితే కొందరికి శృంగారం మీద తక్కువగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే చాలామంది భార్యాభర్తలు శృంగారం చేసే ముందు అసలు ప్లానింగ్ లేకుండా చేస్తారు. కలయిక ముందు భార్యభర్తలు కొన్ని నియమాలను పాటిస్తే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శృంగారం ఒక మెమోరీగా గుర్తుంటుందట. మరి కలయిక ముందు పాటించే ఆ నియమాలేంటో తెలుసుకుందామా.

    రోజుకి రెండుసార్లు స్నానం చేస్తే చాలా రిఫ్రెష్ అనిపిస్తుంది. కానీ చాలామందికి స్నానం చేయడమంటే బద్దకంగా ఫీల్ అవుతారు. ఇలా ఫీల్ అయ్యే కలయిక సమయంలో కూడా స్నానం చేయరు. కలయికకు ముందు భార్యాభర్తలు స్నానం చేస్తే చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రెష్ కాకుండా కలయికలో పాల్గొనడం వల్ల మీ పార్ట్‌నర్‌కి చెమట వాసన వస్తుంది. దీంతో అంత ఇష్టం మీద శృంగారం చేయలేరు. కాబట్టి వీలైనంత వరకు శృంగారానికి ముందు మంచిగా ఫ్రెష్ అయి చేయండి. దీనివల్ల మీ పార్ట్‌నర్ కూడా మంచి అనుభూతిని పొందుతారు.

    కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది. అయిన ఇదేమి పట్టించుకోకుండా కలయికలో పాల్గొంటారు. దీనివల్ల పార్ట్‌నర్ దగ్గరగా ఉండలేరు. మధ్యలో అవాంతరం ఏర్పడుతుంది. కాబట్టి శృంగారంలో పాల్గొనే ముందు నోటిని బాగా క్లీన్ చేసుకుంటే బెటర్. కొంతమంది మద్యం తాగి శృంగారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇలా చేయకపోవడం మంచిది. మద్యం తాగిన తర్వాత ఆ వాసన తప్పకుండా వస్తుంది. దీంతో మీరు పార్ట్‌నర్ దగ్గరకు వెళ్తే ఆ వాసనకు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి మద్యం తాగి శృంగారంలో పాల్గొనవద్దు.

    భార్యాభర్తలు ఎప్పుడు శృంగారంలో పాల్గొన్న.. మొదటి రాత్రి ఫీలింగ్ వచ్చేలా ఉండాలి. ఆ రోజులా రూమ్‌ను డెకరేట్ చేసుకోకపోయిన.. శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రూమ్ నీట్‌గా పరిమళంగా ఉంటే భార్యాభర్తలు శృంగారాన్ని ఆస్వాదిస్తారు. లేకపోతే శృంగారం చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది వాళ్ల మూడ్‌ను బట్టి శృంగారం చేస్తారు. మీ పార్ట్‌నర్‌ మూడ్ ఎలా ఉందో తెలుసుకుని కలయికలో పాల్గొండి. బంధంలో ఇద్దరి ఇష్టాయిష్టాలు ముఖ్యం. కాబట్టి కలయికలో పాల్గొనే ముందు ఈ నియమాలు పాటించండి. మీ భార్యాభర్తలు ఇంకా దగ్గర కావడంతో పాటు శృంగారం ఫీల్‌ను పొందుతారు.