Dengue Fever: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో డెంగ్యూ దాని ప్రతాపం చూపిస్తుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసుల డేంజర్ బెల్స్ మోగుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇక భుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ సంవత్సరమే ఇప్పటికీ ఏకంగా 5,372 మంది డెంగ్యూ బారిన పడ్డారట. జూన్ నెల చివరి వరకు 1,078 మందికి డెంగ్యూ వచ్చింది. గడిచిన రెండు నెలలుగా 4,294 మందికి డెంగ్యూ ఫీవర్ రావడంతో..ఈ వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఆసుపత్రులకు వస్తున్నార. ఒక ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
డెంగ్యూ నిర్ధరణకు టెస్టులు నిర్వహించగా.. 6.5 శాతం పాజిటివిటీ రేటు వస్తుందని తెలుపుతున్నాయి అధ్యయనాలు. అంటే ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగ్యూ నిర్ధారణ వస్తుందన్నమాట. డెంగ్యూ కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయని తెలుపుతున్నారు నిపుణులు. వర్షాలు ఎక్కువ రావడంతో సెప్టెంబరు చివరి వరకు డెంగ్యూ కేసులు మరిన్ని పెరుగుతాయని అంచనా వేస్తున్నారు వైద్యులు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 8,016 డెంగీ కేసులు నమోదయ్యాయి అని తెలిపింది వైద్యారోగ్యశాఖ.
ప్రతి ఏడాది వర్షాకాలంలో ఏడిస్ ఈజిప్టి దోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఇది కుట్టిన 4 నుంచి 6 రోజులలో డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇప్పుడు ఈ వ్యాధి సోకిన వ్యక్తిని స్టెరైల్ ఏడిస్ దోమ కుడితే.. ఆ దోమ కూడా డెంగ్యూ ఫీవర్ దోమగా మారుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతుంటాయి.
పట్టణ ప్రాంతాల్లోని ఎలైట్ ఏరియాల్లో, పెద్ద పెద్ద భవనాల్లో డెంగ్యూ దోమల వ్యాప్తి ఎక్కువ ఉంటుందట. అంటే ఈ ఫీవర్ కూడా ఈ ప్రాంతాల వారికి ఎక్కువ వస్తుందన్నమాట. మురికివాడలు లేదా గ్రామాలలో నివసించే ప్రజలకు డెంగ్యూ రావడం చాలా కష్టమే.
అధిక జ్వరం , శరీరమంతా తీవ్రమైన నొప్పిని, శరీరంలో, ముఖ్యంగా ఎముకలు, తుంటి, వీపుతో సహా కీళ్ళు , కండరాలలో తీవ్రమైన నొప్పి రావడం, తలనొప్పి , కళ్ళ వెనుక నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నొప్పి చాలా తీవ్రంగా ఉంటూ.. ఎముక విరిగిపోయినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 4 లేదా 5 రోజుల జ్వరం సమయంలో, శరీరం అంతటా ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తుంటాయి. వికారం , వాంతులు కూడా అవుతుంటాయి. అధిక అలసట , ఆకలి ఉంటుంది. అయితే సాధారణ జ్వరం 4 లేదా 5 రోజులకు తగ్గిపోతుంది . కానీ కొంతమంది రోగులలో ఈ డెంగ్యూ జ్వరం 2 లేదా 3 రోజుల తర్వాత తిరిగి వస్తుంది.
ముక్కు , నోటి నుంచి, చిగుళ్ళు , దంతాల నుంచి రక్తస్రావం అవడం, కఫం, వాంతుల రక్తం, మలం నల్లగా అవడం, మలంలో రక్తం, కంటి లోపల , బయటికి రక్తస్రావం, మహిళలు అకాల ఋతుస్రావం లేదా రక్తస్రావం వంటి లక్షణాలను కూడా కొన్ని సార్లు కలిగి ఉంటారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే ఈ జ్వరం లక్షణాలు గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే, ఈ జ్వరం ప్రాణాంతకం కూడా అవుతుంది అంటున్నారు నిపుణులు.