Job Vacancies In Tirupati: తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 28 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రేడియోలాజికల్ ఫిజిసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజిసిస్ట్/న్యూక్లియర్ ఫిజిసిస్ట్ జాబ్స్ ను భర్తీ చేయనున్నారు.

42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. వ్యాలిడ్ గేట్ స్కోర్, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లతో పాటు పది, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి అసలు కారణం ఏంటి?
అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ, అకాడమిక్ మెరిట్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. సంస్థ చిత్తూర్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: మంత్రి గౌతంరెడ్డి ఫ్యామిలీ సంచలనం.. ప్రభుత్వానికి కోట్ల ఆస్తులు.. ఆయన పేరుతో యూనివర్సిటీ
Recommended Video:
