spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila : సీఈసీపై అభిశంసన.. జగన్ ను ఏకిపారేస్తున్న షర్మిల!

YS Sharmila : సీఈసీపై అభిశంసన.. జగన్ ను ఏకిపారేస్తున్న షర్మిల!

YS Sharmila : భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) జగన్ మోహన్ రెడ్డి దత్తపుత్రుడు. ఇలా ఆరోపిస్తోంది ఎవరో కాదు. ఆయన సోదరి షర్మిల. దమ్ముంటే బిజెపిని వ్యతిరేకించు. కేంద్ర ఎన్నికల కమిషనర్ పై అభిసంశనకు మద్దతు ఇవ్వాలని కూడా సవాల్ చేస్తున్నారు షర్మిల. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది దొంగ ఏడుపు లేనని తేల్చేస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు ప్రచార అస్త్రంగా మారుతోంది. కూటమి ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే ఎన్డీఏలో టిడిపి తో పాటు జనసేన భాగస్వామి. అందుకే ఇప్పుడు షర్మిల చేస్తున్న డిమాండ్ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్నర్ కాక తప్పదు. ఎందుకంటే షర్మిల బిజెపి దత్తపుత్రుడు అని ఆరోపణలు చేస్తున్నారు అంటే.. దానిని తిప్పి కొట్టే స్థితిలో కూడా లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* రాష్ట్ర ప్రయోజనాలు ఏవి?
2019లో 22 ఎంపీ సీట్లతో పాటు 151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ. ఇది అంతులేని విజయం కూడా. అదే సమయంలో 11 రాజ్యసభ స్థానాలను దక్కించుకుంది ఆ పార్టీ. ఏపీ నుంచి రాజ్యసభ ప్రాతినిధ్యం మొత్తం ఆ పార్టీదే. మరి ఆ సమయంలో ఎన్డీఏ భాగస్వామి కూడా కాదు. కానీ అంతకుమించి రాజకీయ స్నేహంతో కొనసాగేది బిజెపితో. చంద్రబాబు పై ఉన్న కోపంతో కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకున్నారు. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏ స్థాయిలో నెరవేర్చుకోవాలి. రాజధాని పూర్తి చేయలేకపోయారు. అనుకున్న మూడు రాజధానుల విషయంలో అడుగు వేయలేకపోయారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. పోనీ ప్రత్యేక ప్రాజెక్టులు తెచ్చారా అంటే అది లేదు.

* ఇప్పుడే అసలు సమస్య..
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు రావడం లేదు. బిజెపి అడగకుండానే అన్ని అంశాల్లో మద్దతు తెలుపుతోంది. అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అదే కూటమి కేంద్రంలో భాగస్వామ్యం అన్న విషయాన్ని మరిచిపోతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని చెబుతోంది. ఇప్పటికీ అదే తరహా ఆరోపణలు చేస్తోంది. ఇండియా కూటమి సైతం జాతీయస్థాయిలో ఇదే అభిప్రాయంతో ఉంది. అందుకే సిసి పై అభిశంషన తీర్మానం పెడుతోంది. కానీ దానికి మద్దతు తెలపడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే షర్మిల ఇప్పుడు బిజెపికి జగన్ దత్తపుత్రుడు అని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. షర్మిల ఆరోపణలకు మాత్రం ఎదురు చెప్పలేకపోతోంది. ఇది ముమ్మాటికీ ఆ పార్టీకి లోటు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular