ys sharmila focus constituencies : ఏపీ రాజకీయాల్లో వైయస్ షర్మిల దూకుడు పెంచాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా గట్టి అభ్యర్థులను బరిలో దించడం ద్వారా ఓట్లతోపాటు సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు తాను సైతం ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు షర్మిల. త్రిముఖ పోటీలో భాగంగా.. ఆమె ఏకంగా లక్ష యాభై వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఒకానొక దశలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఓడిపోతారని కూడా అంచనాలు వచ్చాయి. అయితే రాజకీయ ప్రత్యర్థిగా భావించే జగన్మోహన్ రెడ్డి పార్టీని గట్టిగానే దెబ్బతీయగలిగారు షర్మిల. కడప జిల్లాలో కూటమికి ఏడు అసెంబ్లీ స్థానాలు లభించాయి అంటే.. షర్మిల ప్రభావం అధికంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. వైసిపి ఓడిపోయేందుకు షర్మిల దోహదపడ్డారు.
* అసెంబ్లీకి పోటీ..
అయితే ఈసారి పార్లమెంట్ స్థానానికి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు షర్మిల. దానికి కారణం లేకపోలేదు. అసెంబ్లీలో తన వాయిస్ వినిపించడం ద్వారా తన పొలిటికల్ కెరీర్ కు ఒక నిర్మాణం జరుపుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయినా.. ఆయన అసెంబ్లీకి రారు. అధికారంలోకి వస్తే అదే జగన్మోహన్ రెడ్డి పై గట్టిగానే తన వాయిస్ వినిపించవచ్చు. ఈ రెండు కారణాలతోనే షర్మిల ఇప్పుడు అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. తనకు సేఫ్ గా ఉండే నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో ఉన్నారు. రాయలసీమలో అయితే కలిసి వస్తుందన్న అంచనా. ఆపై కడప జిల్లాలో అయితే సునాయాసంగా విజయం సాధించవచ్చు అనేది ఆమె అభిప్రాయం. అందుకే కడప జిల్లాలో ఆమె అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
* కమలాపురం పై…
కడప జిల్లాలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై ఆమె దృష్టి పెట్టారు. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. దానికి కారణం లేకపోలేదు. ఆ నియోజకవర్గం తన తల్లి విజయమ్మ పుట్టినిల్లు. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ నియోజకవర్గ అయితే సేఫ్ జోన్ గా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. కడప నియోజకవర్గం పై కూడా ఆమె దృష్టి పెట్టారట. జిల్లా కేంద్రం కావడంతో అక్కడ నుంచి రాజకీయాలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారట. పైగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు ఎక్కువ. మరి షర్మిల ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.