ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ర్టంలో అమలు చేయాలని సంకల్పించింది. త్వరలో భర్తీ చేసే ఉద్యోగ ప్రకటనల్లో ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తారు. అరకొర ఉద్యోగాలు ఉండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ ప్రకటన విషయంలో ప్రధానంగా తెరపైకి వస్తున్న విషయం కాపు రిజర్వేషన్లు. సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం నిలిపివేసింది.
కేంద్రం గతంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించింది. అన్ని స్టేట్లు ఈ విధానాన్ని అమలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆ పది శాతంలో కాపులకు ఐదు శాతం కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపచేశారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూ ఎస్ కోటాలో భాగంగా కల్పించారు. మిగిలిన వారికి 5 శాతం ఇస్తారు. మహిళలకు 33 శాతం ఉంటుంది. అయితే జగన్ వచ్చాక ీ నిర్ణయాన్ని అమలు చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులు చేయకూడదని బీజేపీ, వైసీపీ నేతలు చెప్పారు. కేంద్రం చేసిన రిజర్వేషన్లు కేంద్రానికే పరిమితం. స్టేట్లకు వర్తించవనే కారణంతో ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే చెల్లేలా ఉన్నాయన్నారు. దీంతో రాష్ర్ట పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో చట్టం అమలుచేయాలంటే దానికి తగినట్లుగా రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గుజరాత్ వంటి స్టేట్లలోఈ కోటా బిల్లు మార్పులు చేసి అమలుచేస్తున్నాయి. కానీ ఏపీకి వచ్చేసరికి రిజర్వేషన్ సర్టిఫికెట్లు కాపులకు జారీ చేస్తే వారికి అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని భావించి జగన్ సర్కారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని భావిస్తోంది.
ఏపీలో కాపు నేతలెవరు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రిజర్వేషన్ల ఉద్యమం చేస్తారని చెబుతున్నారు. ఏ రూపంలో రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా పట్టించుకోరనే ముద్ర పడిపోయింది. దీనితో కాపుల రిజర్వేషన్ల హక్కులు కోల్పోవడం జరుగుతోంది. ఇక వారు ఎప్పుడు ఉద్యమం చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోంది.