https://oktelugu.com/

Fadeout Directors : ఈ ఫేడౌట్ డైరెక్టర్లు కంబ్యాక్ ఇస్తే మామూలుగా ఉండదు..ఇంతకీ వాళ్ళెవరూ అంటే..?

ముఖ్యంగా ఈ ఇద్దరు దర్శకులు మాత్రం ఫెయిడ్ అవ్వడానికి వాళ్లు ఇప్పుడున్న ప్రేక్షకుల ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోకపోవడమే కారణమని తెలుస్తుంది...ఒకవేళ వీళ్ళు కనక వాళ్ల ధోరణి ని మార్చుకొని సినిమాలు తీస్తే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం సూపర్ హిట్లు కొట్టచ్చు...

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2024 / 08:53 AM IST

    Will these fadeout directors make a comeback in Tollywood?

    Follow us on

    Fadeout Directors : చాలా మంది డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ కాలం పాటు కొనసాగలేరు. దానికి కారణం ఎనింటి అనేది సరిగ్గా తెలియదు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన వాళ్లు కూడా ఆ తర్వాత ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడంలో ఫెయిల్ అయ్యారు. అందువల్లే వాళ్లు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో సూపర్ హిట్ సినిమాలను తీసిన ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఫేడ్ అవుట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం…

    విక్టరీ వెంకటేష్ హీరోగా అంజలి జవేరి హీరోయిన్ గా వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకి దర్శకుడుగా పరిచయమైన జయంత్ సి పరంజి ఆ సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక తన స్టైలిష్ మేకింగ్ తో అప్పుడున్న ప్రేక్షకులను కట్టి పడేశాడనే చెప్పాలి. ఇక వరుసగా చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ తను పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ సినిమాను మాత్రం సక్సెస్ ఫుల్ గా చేయలేకపోయాడు. ఇక అప్పటి నుంచి ఆయనకి సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు ఇచ్చే నిర్మాతలైతే కరువయ్యారు. దానివల్లే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇక ఇప్పటికీ ఆయన సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకి ఏ హీరో కూడా డేట్స్ అయితే ఇవ్వడం లేదు…

    బాలయ్య బాబుతో రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీసిన బి.గోపాల్ కూడా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఈయన ఫేడ్ అవుట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈయన కథలో పెద్దగా వైవిధ్యం అయితే ఉండడం లేదు. 90స్ స్టోరీస్ ని ఇప్పుడు తీస్తే జనాలు ఎలా చూస్తారు అంటూ ఆయన మీద కొంతమంది విమర్శలను కూడా చేస్తున్నారు.

    ముఖ్యంగా ఈ ఇద్దరు దర్శకులు మాత్రం ఫెయిడ్ అవ్వడానికి వాళ్లు ఇప్పుడున్న ప్రేక్షకుల ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోకపోవడమే కారణమని తెలుస్తుంది…ఒకవేళ వీళ్ళు కనక వాళ్ల ధోరణి ని మార్చుకొని సినిమాలు తీస్తే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం సూపర్ హిట్లు కొట్టచ్చు…

    ఇక ఇదే లిస్ట్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన బ్లాక్ బస్టర్ పాత దర్శకులు ఉన్నారు. కృష్ణవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి, విజయ్ భాస్కర్, శ్రీనువైట్ల, వివి వినాయక్, పూరి జగన్నాథ్, గుణశేఖర్ లాంటి వారు ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు అసలు చాన్స్ లు లేక కునారిల్లుతున్నారు. స్టార్ హీరోలు వీళ్లను పట్టించుకోవడమే మానేశారు.