
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితులుగా వున్న 49మంది నిర్దోషులే అని సిబిఐ ప్రత్యక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం విదితమే. ఈ తీర్పును హై కోర్ట్ లో సవాల్ చేసే విషయంపై ముస్లిం సంస్థలతో కలిసి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి చెప్పారు. నిందితులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు సాక్ష్యం ఇచ్చిన, వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని సీనియర్ న్యాయవాది జాఫర్‌యాబ్ జిలానీ తెలిపారు. నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని అన్నారు.