
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచంలోని ఎంతో మంది ప్రాణాలు కోల్పాయారు. మరికొంతమంది ఉపాధి కోల్పోయి బిక్కు బిక్కుమంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందా… ? ఆంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. యూరోప్ లోని చాలా దేశాలలో ఇప్పటికే కరోనా రెండో దశ ప్రారంబమై రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా రెండో దశ ప్రారంభమైతున్నట్లు తెలుపుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల 10లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పాయారు.