
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వైరస్ ప్రభావం తగ్గినా ప్రజలను వైరస్ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. వైరస్ పై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలు ప్రజల్లో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు ఒకసారి కరోనా బారిన పడితే మరోసారి కరోనా సోకదని చెబుతున్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తల పరిశోధనలు మాత్రం కరోనా సోకిన వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.
Also Read : మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు
కరోనా సోకిన వాళ్లు మూడు నెలల వరకే సేఫ్ గా ఉంటారని ఆ తర్వాత వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనని వెల్లడిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఏడాది కాలం పాటు వైరస్ బారిన పడకుండా ఉంటారని.. సంవత్సరం తరువాత మరోసారి వ్యాక్సిన్ తీసుకోక తప్పదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. వ్యాక్సిన్ నుంచి శరీరంలో చేరిన యాంటీబాడీలు సైతం మూడు నెలల కంటే ఎక్కువ కాలం ఉండవు.
చికెన్ ఫాక్స్, హెచ్ఎఫ్ఎమ్ లాంటి వ్యాధుల బారిన పడ్డ వారిలో సైతం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు మాత్రమే యాంటిబాడీలు ఉంటాయి. ఎవరైనా కరోనా బారిన పడితే నాలుగో రోజు నుంచి ఐజీఎమ్ యాంటీబాడీస్, 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఐజీజీ యాంటీబాడీస్ వల్ల రోగి కరోనా వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్లే వైద్యులు 14వ రోజు తరువాత పరీక్షలు నిర్వహించకుండానే రోగులను ఇంటికి పంపిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం మొదటి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : అన్ లాక్ 5.0 : థియేటర్లకు అనుమతి