New Ration Cards: ఏపీలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్ తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డులు స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణి చేసింది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.