https://oktelugu.com/

Adirindi: విజయ్ అదిరింది సినిమా తెలుగులో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

మిళ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ అయిన అట్లీ డైరెక్షన్ లో తమిళ ఇండస్ట్రీ లో ఇళయ దళపతికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న విజయ్ హీరోగా వచ్చిన అదిరింది సినిమా తమిళం లో సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 27, 2024 / 07:29 AM IST

    Adirindi

    Follow us on

    Adirindi: మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా కాన్సెప్ట్ బాగుంది అంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాలను చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. అందువల్లే చాలామంది ఇతర భాషల హీరోలు కూడా వాళ్ల హవాను చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు.

    ఇక మిగతా ఇండస్ట్రీలలో మన హీరోల సినిమాలను ఎక్కువగా ఆదరించరు. అయినప్పటికీ మన వాళ్లు మాత్రం ప్రతి సినిమాని ఆదరిస్తుంటారు. అందుకే వాళ్ల ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు లేని హీరోలు కూడా ఇక్కడ స్టార్లుగా కొనసాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ అయిన అట్లీ డైరెక్షన్ లో తమిళ ఇండస్ట్రీ లో ఇళయ దళపతికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న విజయ్ హీరోగా వచ్చిన అదిరింది సినిమా తమిళం లో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. కానీ తెలుగులో మాత్రం అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు. దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు ఓవర్ గా ఉండటం వల్లే ఆ సినిమా ప్రేక్షకుడికి రియలేస్టిక్ అనిపించలేదు.

    దానివల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా ఇక్కడ మాత్రం ఎందుకు ఆడలేదు అని చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ తెలుగు వాళ్ళకి నచ్చదు. ఆయన సినిమాలో కొంత ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కొన్ని సీన్లని కరెక్ట్ గా పొట్రే చేయలేకపోయాడు. దానివల్లే ఆ ఎమోషన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదనే చెప్పాలి.

    ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆదరించలేకపోయింది. ఇక ఈ స్టోరీ లో కూడా పెద్దగా కొత్తదనం ఏమీ లేకుండా పోయింది. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న మోసాల గురించి చెప్పడం అనేది చాలా రోజుల నుంచి వస్తుంది. కాబట్టి ఈ స్టోరీ నే సెంటర్ పాయింట్ గా తీసుకొని సినిమా చేయడం అనేది ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అందువల్లే ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక అట్లీ తీసిన సినిమాల్లో రాజా రాణి ని మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా తెలుగులో అంత పెద్ద సక్సెస్ సాధించలేదు…