CM Chandrababu: ఏపీలో ఏడాదిలోనే స్పష్టమైన మార్పు చూపించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండానలి అన్నారు.