Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాముంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రి వర్గవలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపత్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పీసీస, సీఎం ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు.