ఐపీఎల్ లో అవకాశం వచ్చినప్పుడు.. దాన్ని కచ్చితంగా ప్లేయర్లు ఉపయోగించుకోవాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోకపోతే అప్పుడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఈ ఇబ్బందిని ఆటగాడు పడ్డాడు. చివరికి తన తప్పు తెలుసుకున్నాడు. ఆట మీద దృష్టి కేంద్రీకరించాడు. సీన్ కట్ చేస్తే.. ఓవర్ నైట్ హీరో అయిపోయాడు.
ఆదివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ చివరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు. పంజాబ్ జట్టుకు ఓటమి అంటే ఏమిటో చూపించాడు.. 23 బంతులు ఎదుర్కొన్న సుందర్ 40* పరుగులు చేశాడు.. స్టోయినిస్ బౌలింగ్ లో ఆఖరి ఓవర్ ఐదవ బంతికి సిక్సర్ కొట్టి అదరగొట్టాడు. సుందర్ సిక్సర్ కొట్టడంతో గుజరాత్ జట్టు విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు ముందుగా బౌలింగ్ వేశారు. అద్భుతంగా బంతులు వేసి పంజాబ్ జట్టును 163 పరుగులకు కట్టడి చేశారు. 164 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన గుజరాత్ జట్టు ఒక దశలో ఈజీ గానే గెలుస్తుందని అనుకున్నారు. కానీ పంజాబ్ బౌలర్లు సత్తా చూపించడంతో గుజరాత్ ఇబ్బంది పడింది. పరుగులు తీయడం కష్టంగా మారింది. ఈ దశలో సుందర్ నిలబడ్డాడు. 23 బంతుల్లో 40 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
సుందర్ గత ఐపిఎల్ లో ఓ యాంకర్ తో కలిసి తిరిగినట్టు విమర్శలు వినిపించాయి. దీంతో అతడు తన ఆట తీరును పూర్తిగా కోల్పోయాడు. ఒక దశలో అతడికి అవకాశాలు కూడా రాలేదు. ఆట మీద మనసు లగ్నం చేయకుంటే.. వేరే విషయాల మీద దృష్టి పెడితే ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది. అందువల్లే తన ఇతర అలవాట్లను పక్కన పెట్టాడు. ఆట మీద మాత్రమే ఫోకస్ చేసి.. సిసలైన ప్లేయర్ గా అవతరించాడు. తద్వారా గుజరాత్ జట్టు తరఫున ఓవర్ నైట్ హీరో అయిపోయాడు.
సుందర్ అద్భుతమైన ఆటగాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తనదైన రోజు అద్భుతాలు సృష్టిస్తాడు. పైగా స్థిరమైన ఇన్నింగ్స్ ఆడితే మాత్రం గట్టిగా నిలబడతాడు. అందువల్లే అతడు ఆదివారం నాటి మ్యాచ్లో అదరగొట్టాడు.. గుజరాత్ జట్టు తరఫున ఒకసారిగా హీరో అయిపోయాడు.
THE FINISHER OF GT, WASHINGTON SUNDAR
– 40*(23) under pressure in an important match for GT. pic.twitter.com/z5to7pfq8Y
— Johns. (@CricCrazyJohns) May 3, 2026