FUNKY Teaser Review : జాతి రత్నాలు వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ నుండి వచ్చిన ‘ప్రిన్స్’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దర్శకత్వం మీదకంటే ఆయన వెండితెర మీద నటుడిగానే ఎక్కువగా కనిపించాడు. అయితే రీసెంట్ గానే మూడు నెలల క్రితం హీరో విశ్వక్ సేన్ తో ఆయన ఫంకీ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. కాయాదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరో విశ్వక్ సేన్ సినిమా డైరెక్టర్ గా నటించాడు, హీరోయిన్ కాయాధు లోహర్ నిర్మాత గా నటించినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.
ఈ సినిమా టీజర్ లో అనుదీప్ తన మార్క్ కామెడీ ని అడుగడుగునా చూపించాడు. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ అన్ని సెక్షన్ ఆడియన్స్ కి నచ్చదు. కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే నచ్చుతుంది. కుళ్ళు కామెడీ అంటారు కదా?, ఆ టైపు అన్నమాట. టీజర్ మొత్తం చాలా ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి కానీ, ఎందుకో అవి హీరో విశ్వక్ సేన్ కి సూట్ కాలేదని అనిపించింది. ఈయనకు బదులుగా నవీన్ పోలిశెట్టి, లేదా సిద్దు జొన్నలగడ్డ హీరో గా చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక హీరోయిన్ కాయదు నుండి కూడా కామెడీ టైమింగ్ ని లాగే ప్రయత్నం చేసాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. మొత్తం మీద లైలా వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విశ్వక్ సేన్ కి ఈ సినిమా ఒక డీసెంట్ కం బ్యాక్ అయ్యేలాగానే కనిపిస్తుంది. చూడాలి మరి సినిమా కూడా ఆడియన్స్ ని ఇదే విధంగా అలరిస్తుందా లేదా అనేది. యూత్ ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.