
మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్ గజపతిరాజు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు పై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం తప్పదన్నారు. మాన్సస్ ట్రాస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారన్నారు. సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించ వద్దని గతంలో తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.