
ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న ఓ బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగీత్ నగర్ లో నివసించే ఆనంద్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మరకంఠ (12) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మణికంఠ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. అయితే మణికంఠ వద్ద ఉన్న మొబైల్ లో వీడియోగేమ్ ఓపెన్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీడియోగేమ్ లు చూస్తే ఆత్మహత్యు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.