https://oktelugu.com/

ఏపీ సీఎస్ గా సమీర్ శర్మ? ఆదిత్యనాథ్ దాస్ కు ఉద్వాసనేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగించాలని ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. పొడిగింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ఆయన ఈ నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. దీంతో హఠాత్తుగా ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో సమీర్ శర్మ ఏపీ సీఎస్ గా రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని […]

Written By: , Updated On : June 26, 2021 / 04:32 PM IST
Follow us on

AP New CSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగించాలని ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. పొడిగింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ఆయన ఈ నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. దీంతో హఠాత్తుగా ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో సమీర్ శర్మ ఏపీ సీఎస్ గా రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన విభాగం కార్పొరేట్ అఫైర్స్ విభాగాన్ని చూస్తున్న సమీర్ శర్మ ఏపీకి రావడం సీఎస్ పదవి కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియామకం జరిగినట్లేనని ప్రచారం ఊపందుకుంది. కరోనా కాలంలో సీఎస్ లాంటి అధికారులకు పొడిగింపును కేంద్రం ఇస్తున్న సందర్భంలో ఆదిత్యనాథ్ దాస్ కు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు.

దీనిపై డీవోపీటీ నుంచి ఏపీ సర్కారుకు స్పష్టత లేకుండా పోతోంది. సమీర్ శర్మ ఏపీ కేడర్ కు రావడం సంచలనం కలిగిస్తోంది. ఆదిత్యనాథ్ దాస్ కు పొడిగింపు ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సమీర్ శర్మను నియమించినట్లు చెబుతున్నారు. నిజానికి ఆదిత్యనాథ్ కంటే సమీర్ రెండేళ్లు సీనియర్. కానీ వయసులో ఐదు నెలలు చిన్న.

అందుకే ఆయన ఉద్యోగ విరమణకు ఇంకా సమయం ఉన్నందున సీఎస్ గా సమీర్ ను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్యనాథ్ దాస్ కు అన్ని దిక్కుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఆయన నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఏపీ సీఎస్ గా ఎవరు నియామకం అవుతారోననే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.