Vaibhav Surya Vamshi wicket : భారీగా పరుగులు చేసినప్పటికీ ఓటమి. బౌలర్లు సక్రమంగా బౌలింగ్ చేయకపోవడంతో దారుణమైన పరాభవం.. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని అవరోధాల మధ్య సొంత మైదానంలో అడుగు పెట్టింది హైదరాబాద్ జట్టు. అంతకుముందు లక్నోతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో సోమవారం రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ మీద పెద్దగా అంచనాలు లేవు. రాజస్థాన్ జట్టు అంతకుముందే ముంబై, బెంగళూరును ఓడించి సూపర్ ఫామ్ లో ఉంది. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయాలు సాధించింది.
kavya maran saying “oh fuck” pic.twitter.com/QYxp3bJoQ6
— sportsstats (@sportsstatcs1n) April 13, 2026
రాజస్థాన్ జట్టు ఎదుట హైదరాబాద్ 217 రన్స్ టార్గెట్ విధించినప్పుడు.. గెలుపు మీద పెద్దగా ఆశలు లేవు. ఎందుకంటే రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్య వంశీ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. జైస్వాల్ ఒక రేంజ్ లో ఆడుతున్నాడు.. జురెల్ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ త్రయం కచ్చితంగా దుమ్ము రేపుతుందని.. హైదరాబాద్ జట్టును ఓడిస్తుందని అప్పటికే చాలామంది ఒక అంచనాకొచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో సమర్థవంతమైన బౌలర్లు లేరు. జయదేవ్.. హర్షల్ వంటి వారిని పక్కన పెట్టారు. కొత్తగా ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్ ను జట్టులోకి తీసుకున్నారు. వీరికి కూడా పెద్దగా అనుభవం లేదు. దీంతో రాజస్థాన్ జట్టు త్వరగానే టార్గెట్ ఫినిష్ చేస్తుందని ఒక అంచనా మొదలైంది. కానీ, అక్కడే అద్భుతం ప్రారంభమైంది. ప్రఫుల్ తొలి ఓవర్ లోనే రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను వెనక్కి పంపించాడు. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీ (0) ని సున్నా పరుగులకు అవుట్ చేశాడు.
ప్రఫుల్ లో లెవెల్ లో బౌన్సర్ వేశాడు. ఆ బంతి గమనాన్ని సూర్య వంశీ అంతగా అంచనా వేయలేదు. తనకు అలవాటైన షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. ఆ బంతి కాస్త బ్యాట్ చివరి అంచుకు తగిలింది. అమాంతం గాలిలోకి లేచింది. వికెట్ల వెనకాల ఉన్న కీపర్ ఆ బంతిని అత్యంత ఒడుపుగా అందుకున్నాడు. దీంతో సూర్య వంశీ 0 పరుగులకే పెవీలియన్ చేరుకున్నాడు.
మైదానంలో జరిగిన సంఘటన ఇదైతే.. ప్రేక్షకుల స్టాండ్స్ లో జరిగిన సంఘటన మరొకటి. ఎందుకంటే మ్యాచ్ చూస్తున్న హైదరాబాద్ ఓనర్ కావ్య.. వైభవ్ ఔట్ కాకముందు ఒక రకమైన నిరాశలో ఉంది. ఎందుకంటే అతడు ఇటీవల స్థాయిలో ఆడుతున్న అలా ఉంది మరి. తన జట్టు మీద కూడా అలానే బ్యాటింగ్ చేస్తాడని కావ్య ఆందోళనతో కనిపించింది. బ్యాట్ అందుకోవడమే ఆలస్యం.. బలమైన షాట్ కొట్టడానికి సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడు. ప్రఫుల్ మాత్రం తనకు అలవాటైనా బంతులను వేయడం మొదలు పెట్టాడు. తొలి బంతికి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన ప్రఫుల్.. ఆ తర్వాత బంతికి సూర్యవంశీ ని అవుట్ చేశాడు. దీంతో మైదానంలో ఒకటే కేరింతలు.. తుళ్ళింతలు.. అయితే సూర్యవంశీ కొట్టిన బంతిని కీపర్ పట్టుకునే వరకు కావ్య అలానే చూస్తూ ఉండిపోయింది. తన సీట్ లో నుంచి లేచి నిలబడింది. కీపర్ బంతి అందుకున్న తర్వాత హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. జట్టును గెలిపించడానికి ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తుంటే.. మైదానం వెలుపల మ్యాచ్ చూస్తూ అంతే స్థాయిలో కావ్య ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
