
భారత్ లో వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడించింది. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టే పరిస్థితిలో ఉండవని, ఇక సంపన్న రాష్ట్రాలు గ్లోబల్ మార్కెట్ లో అధిక ధరల్లో వ్యాక్సిన్ల కోసం వెచ్చించాల్సి వస్తుందని ఆ నివేదికలో ఎస్బీఐ ముఖ్య ఆర్థిక వేత్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సమకూరుస్తుందని అంచనా వేస్తూ సిక్కిం ఒక్కో వ్యాక్సిన్ కు 5 డాలర్లు ఖర్చు చేసినా రూ 20 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని నివేదిక వివరించింది.