
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42,959 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మం జిల్లాలో 228, రంగారెడ్డిలో జిల్లాలో 226 కరోనా కేసులు నమోదు అయ్యాయి.