ఉత్తరాఖండ్ లోని వివిధ జైళ్లో మగ్గుతున్న పలువురు ఖైదీలను 90 రోజుల పెరోల్ పై విడుదల చేయనున్నారు. ఈ మేరకు హై పవర్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మారి కొవిడ్ -19 సెకండ్ దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర జైలులో నిర్బంధించిన ఖైదీలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు 90 రోజుల పెరోల్ పై విడుదల చేయనున్నారు. సుప్రీం కోర్టు ఆద్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం హై పవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్శి ఆర్కే ఖుల్బే తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Uttarakhand government decides to release prisoners on parole
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com