
టాలీవుడ్ లోకి ఎంతోమంది హాట్ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చినా.. ఏ రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించినా ‘కాజల్ అగర్వాల్’లా ఎవ్వరూ మెప్పించ లేరేమో. ఫ్యామిలీ రోల్స్ చేస్తూనే, హాట్ హాట్ రోల్స్ లో గిలిగింతలు పెట్టడం అంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాజల్ 16 ఏళ్ళ వయసులోనే ముఖానికి మేకప్ వేసుకుని మోడల్ గా సెగలు పుట్టించింది.
ఇక ఆ తరువాత హీరోయిన్ అవతారం ఎత్తి, దాదాపు పదిహేను ఏళ్ళ పాటు కుర్రాళ్లకు అందాల కనువిందు చేస్తూ గత ఏడాదే పెళ్లి చేసుకుని మొత్తానికి సెటిల్ అయింది. పెళ్లి అయింది కాబట్టి, అందాల ప్రదర్శనలో లిమిట్స్ పెట్టుకుంటుందేమో అనుకుంటే.. పెళ్లి అయ్యాక కూడా ‘అక్కినేని సమంత’లా రోజురోజుకూ మరీ రెచ్చిపోతూ ఉంది.
అటు బాలీవుడ్ సినిమాల అవకాశాల కోసం ఆశ పడుతూనే, ఇటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ మొత్తానికి ఇప్పట్లో తన గ్లామర్ షో ఆగదు అని సింబాలిక్ గా చెప్పకనే చెబుతుంది. ఎవరికైనా సహజంగా వయసు పెరిగేకొద్ది అందం తగ్గిపోవడం సహజం, పైగా అదే ప్రకృతి ధర్మం కూడా. కానీ ఈ ముదురు భామకు మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది.
ముప్పై ఐదేళ్లు వచ్చినా ఇంకా ట్వంటీ ఏజ్ లో ఉన్నట్టే బాడీని మెయింటైన్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో రఫ్ఫాడిస్తూ ఘాటు లుక్స్ తో హీట్ పెంచుతుంది. తాజాగా ఒక ఫోటో వదిలింది. ఈ ఫోటోలో అందాల ప్రదర్శన మరీ ఎక్కువ కాలేదులే గానీ, కాజల్ తన పర్ఫెక్ట్ బాడీతో ఘాటు ఫోజులతో కొంటెగా చూస్తూ కవ్విస్తూ కనిపిచింది.
ఈ ఫోటో చూసి కాజల్ అభిమానులు తనవితీరా షేర్ అండ్ లైక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అసలు కాజల్ నుండి ఈ మధ్య ఫోటో వస్తోంది అంటే చాలు, ఇక ఆ వాతావరణం మొత్తం వేడెక్కినట్టే. ప్రతి ఫోటోలో అందాలను వడ్డించడం కాజల్ కి ఆనవాయితీ అయిపోయింది.