https://oktelugu.com/

అన్ లాక్ 5: కేంద్రం హోంశాఖ మినహాయింపులు ఇవీ

కోరోనా అన్ లాక్ 5 నిబంధనలు కేంద్రం తాజాగా విడుదల చేసింది. నవంబర్ 30వరకు పొడగిస్తూ పలు షరతులు, సడలింపులు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలు నవంబర్ 30వ తేది వరకు వర్తిస్తాయని మంగళవారం కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా అన్ లాక్ 5 సడలింపుల్లో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాలను షరతులతో తెరిచేందుకు అనుమతి ఇస్తూ నవంబర్ 30వరకు ఈ గడువును పొడిగించింది. గత నెల ఇచ్చిన ఈ సడలింపులు […]

Written By: , Updated On : October 27, 2020 / 06:41 PM IST
Follow us on

కోరోనా అన్ లాక్ 5 నిబంధనలు కేంద్రం తాజాగా విడుదల చేసింది. నవంబర్ 30వరకు పొడగిస్తూ పలు షరతులు, సడలింపులు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలు నవంబర్ 30వ తేది వరకు వర్తిస్తాయని మంగళవారం కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా అన్ లాక్ 5 సడలింపుల్లో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాలను షరతులతో తెరిచేందుకు అనుమతి ఇస్తూ నవంబర్ 30వరకు ఈ గడువును పొడిగించింది. గత నెల ఇచ్చిన ఈ సడలింపులు నవంబర్ 30వరకు వెసులుబాటు ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని తేల్చిచెప్పింది. ఇక రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఎటువంటి అనుమతి అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.