https://oktelugu.com/

ఇటలీ వెళ్లినా ప్రభాస్‌కు కష్టాలు తప్పట్లేదు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు వేరే లెవల్ క్రేజ్ ఉంది. ఒక్క దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆయన కోసం ఆబగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అలా రూపొందుతున్న చిత్రమే ‘రాధే శ్యామ్’. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ చిత్రమంటే ఖర్చు గురించి పట్టించుకోకూడదు అనే లెవల్లో ఖర్చుపెడుతున్నారు. Also Read: బన్నీబాబు ముందు […]

Written By:
  • admin
  • , Updated On : October 27, 2020 / 05:54 PM IST
    Follow us on


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు వేరే లెవల్ క్రేజ్ ఉంది. ఒక్క దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆయన కోసం ఆబగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అలా రూపొందుతున్న చిత్రమే ‘రాధే శ్యామ్’. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ చిత్రమంటే ఖర్చు గురించి పట్టించుకోకూడదు అనే లెవల్లో ఖర్చుపెడుతున్నారు.

    Also Read: బన్నీబాబు ముందు వైజాగ్లో ప్రత్యక్షమవుతాడట

    కరోనా లాక్ డౌన్ సడలింపులు అనంతరం షూటింగ్ మొదలైంది. లాక్ ఎత్తివేశాక టాలీవుడ్ నుండి విదేశాలకు వెళ్లి షూటింగ్ చేస్తున్న మొదటి హీరో ప్రభాసే. ప్రజెంట్ ఇటలీలో షూటింగ్ జరుగుతోంది. కొద్దిమంది క్రూతోనే కష్టమైనా ఏదోలా లాగిస్తున్నారు. కానీ తాజాగా త్వరలో కరోనా సెకండ్ వేవ్ మొదలుకానుంది ప్రపంచం మొత్తం అలర్ట్ అవుతోంది. అందుకే ఇటలీలో కర్ఫ్యూ విధిస్తున్నారట.

    Also Read: ఆ దర్శకుడితో హిట్ కొట్టి తీరాల్సిందే అంటున్న బాలకృష్ణ

    కర్ఫ్యూ మూలంగా రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే షూటింగ్ జరుపుకునే వీలుంటుంది తప్ప మునుపటిలా ఎంతసేపైనా షూట్ చేసే వెసులుబాటు ఉండదు. దీంతో ప్రభాస్ బృందం ఆ కొద్ది గంటల్లోనే ఎంత తీయగలిగితే అంత తీసుకోవడం మళ్ళీ రేపటి కోసం ఎదురుచూడటం చేయనుంది. మొత్తానికి ఇటలీ వెళ్లినా కరోనా కష్టాలు వదల్లేదన్నమాట. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.