కేసీఆర్ తో మాట్లాడిన కేంద్రమంత్రి

నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగురాష్ట్రాల నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో షెకావత్ ఫోన్ లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై  చర్చించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు […]

Written By: Velishala Suresh, Updated On : June 25, 2021 7:24 pm
Follow us on

నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగురాష్ట్రాల నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో షెకావత్ ఫోన్ లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై  చర్చించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలిపింది.