కేసీఆర్ కు ఈటల ప్రశంసలు: ఫేక్ లేఖ కథేంటి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఈటల రాజేందర్ పేరిట ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అందులో ఈటల కేసీఆర్ ను క్షమించాలని అడుగుతూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తూ విషయం ఉంది. దీంతో అందరు హతాశులయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. లేఖ చూసిన వారంతా […]

Written By: Srinivas, Updated On : June 25, 2021 7:27 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఈటల రాజేందర్ పేరిట ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అందులో ఈటల కేసీఆర్ ను క్షమించాలని అడుగుతూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తూ విషయం ఉంది. దీంతో అందరు హతాశులయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

లేఖ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు తిడుతూ వచ్చిన ఈటల ఒక్కసారిగా ఇలా మారిపోయారేంటి అని ప్రశ్నించుకున్నారు. బీజేపీలో చేరే క్రమంలో ఆయన కేసీఆర్ పైనే విమర్శలు చేశారు. ఎక్కడ అవకాశం దొరికినా కేసీఆర్ ను పలు రకాలుగా విమర్శించే ఈటల పాజిటివ్ గా ఎందుకు మాట్లాడతారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. దీనిపై ఈటల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులే ఇలాంటి చౌకబారు విషయాలపై దృష్టి పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈటలను ఫూల్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల పార్టీ మారేటప్పుడు కేసీఆర్ పై చేసిన ఆరోపణలు కూడా గతంలో ఈటల వీడియోలను చూపించి ట్రోల్ చేశారు.

ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ ఇలా ఫేక్ లేఖలు సృష్టించి అనుమానాలు కలిగేలా చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎవరి హస్తం ఉందో కనిపెట్టాలని కోరుతున్నారు. ఈటల ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులే చీప్ గా ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పై పరువు నష్టం దావా వేసి నిజాలు నిగ్గు తేల్చాలని సూచిస్తున్నారు.