
తెలంగాణలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించనున్నామని వెల్లడించారు. వచ్చే నెల 9వ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నావారు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.