
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నోకియా ఫీచర్ ఫోన్లు కొన్నేళ్ల క్రితం రికార్డు స్థాయిలో అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ల ఎంట్రీ తర్వాత నోకియా హవా తగ్గింది. అయితే నోకియా కొత్త ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ మార్కెట్ ను నిలుపుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 110 4జీ ఫీచర్ ఫోన్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
13 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రత్యేకత కాగా 4జీ కనెక్టివిటీతో పాటు వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, హెచ్‌డీ వాయిస్ కాలింగ్ మరికొన్ని ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. మన దేశంలో ఈ ఫోన్ ధర 2,799 రూపాయలుగా ఉండగా ఈరోజున ఈ ఫోన్ సేల్ కు రానుంది. అమెజాన్, నోకియా వెబ్ సైట్ల ద్వారా ఈ ఫీచర్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఈకామర్స్ వెబ్ సైట్లు స్పెషల్ ఆఫర్లను కూడా అందిస్తుండటం గమనార్హం.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 1020 ఎంఏహెచ్ కాగా 5 గంటల 4జీ టాక్‌టైంను ఈ ఫోన్ అందించనుంది. వీడియో ప్లేయర్, ఎంపీ3 ప్లేయర్, 3 ఇన్ 1 స్పీకర్లు ఈ ఫోన్ లో ఉండటం గమనార్హం. కొత్త తరహా యూజర్ ఇంటర్ ఫేస్ తో నోకియా ఈ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న స్నేక్ గేమ్ కూడా ఈ ఫోన్ లో ఉండటం గమనార్హం. ఫీచర్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా నావిగేషన్ మరింత సులభం కానుంది. ఈ ఫోన్ బరువు 84.5 గ్రాములు కాగా ఈ ఫోన్ మందం 1.45 సెంటీమీటర్లుగా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది.