
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లంతా టీఆర్ఎస్ ను ఆశీర్వదించి, పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మొత్తం 43 వార్డులకు గానూ, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక వార్డులో బీజేపీ గెలవగా, మిగతా ఐదు వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోల్ కాగా, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 4 శాతం తగ్గింది.