BSNL : రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంలో భారీగా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. దీని తర్వాత కంపెనీలు తమ వినియోగదారుల సంఖ్యను చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నష్టం ఇంకా ఆగడం లేదు. తాజాగా ట్రాయ్ కొత్త నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రైవేట్ టెలికాం కంపెనీల వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పబడింది. దీనికి సంబంధించి ట్రాయ్ ఎలాంటి కొత్త డేటాను కూడా విడుదల చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
జియో అత్యధికంగా 7.9 మిలియన్ల ప్రిపెయిడ్ కస్టమర్లను కోల్పోయిందని ట్రాయ్ నివేదిక పేర్కొంది. వొడాఫోన్ ఐడియా 1.5 మిలియన్ల ప్రిపెయిడ్ కస్టమర్లను కోల్పోగా, ఎయిర్టెల్ 1.4 మిలియన్ల ప్రిపెయిడ్ వినియోగదారులను కోల్పోయింది. సెప్టెంబర్‌లో వినియోగదారుల సంఖ్యను పెంచుకున్న ఏకైక కంపెనీగా ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL నిలిచింది. కంపెనీ సబ్స్క్రైబర్లు 8,49,493 పెరిగారు. ఈ పరిస్థితిలో బీఎస్ఎన్ఎల్ సంస్థ చాలా లాభపడింది. అంటే ఒకవైపు మొత్తం మూడు కంపెనీల సబ్స్క్రైబర్లు తగ్గిపోతుంటే మరోవైపు బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు వేగంగా పెరుగుతున్నారు.
జూలై నెలలో మూడు కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాయి. కంపెనీలు టారిఫ్ మొబైల్ రేట్లను 11-25శాతం మేరకు పెంచాయి. దీంతో యూజర్ బేస్ గణనీయంగా తగ్గింది. సెప్టెంబర్ చివరి నాటికి జియో 463.78 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది, ఆగస్టులో కంపెనీ 471.74 మిలియన్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్టెల్ గురించి మాట్లాడితే, కంపెనీ 383.48 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఆగస్టులో అదే సంఖ్య 384.91 మిలియన్లుగా ఉంది. సెప్టెంబరులో వోడాఫోన్ 212.45 మిలియన్ల మందిని కోల్పోయింది. ఆగస్టులో ఈ సంఖ్య 214 మిలియన్లుగా ఉంది.
వైర్లెస్ బేస్‌లో బీఎన్ఎన్ఎల్ పెరుగుదల
BSNL వైర్లెస్ బేస్‌ల సంఖ్య 91.89 మిలియన్లకు చేరుకోగా, ఆగస్టులో అదే సంఖ్య 91.04 మిలియన్లుగా ఉంది. ఎయిర్టెల్, వోడాఫోన్ క్రియాశీల వినియోగదారుల సంఖ్యలో కూడా భారీ క్షీణత కనిపించింది. ఎయిర్టెల్ యాక్టివ్ సబ్స్క్రైబర్లు 1.31 మిలియన్లు తగ్గారు. క్రియాశీల సబ్‌స్క్రైబర్ బేస్‌లో జియో 1.73 మిలియన్ల పెరుగుదలను చూసింది. BSNL యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్ సంఖ్య 54.77 మిలియన్ల పెరుగుదలను చూసింది.
దేశంలో టెలికం యూజర్ల సంఖ్య
బీఎస్ ఎన్ ఎల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి, కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. జియో యూజర్లు 47,7 కోట్లు, ఎయిర్ టెల్ 28.5కోట్లు , వొడాపోన్ : 12.26కోట్లు, బీఎస్ఎన్ఎల్ 3.75కోట్లుగా ఉన్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Trai report states that while the subscribers of the three companies are decreasing bsnl subscribers are increasing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com