Homeక్రీడలుక్రికెట్‌Rohith Sharma : ఇప్పటికే అత్తెసరు ఫామ్.. దానికి తోడు తాజా గాయం..పాపం రోహిత్ శర్మ!

Rohith Sharma : ఇప్పటికే అత్తెసరు ఫామ్.. దానికి తోడు తాజా గాయం..పాపం రోహిత్ శర్మ!

Rohith Sharma :  నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభమవనుంది. ఈ టెస్ట్ లో గెలిచి సిరీస్ లో 2-1 లీడ్ సంపాదించాలని టీమిండియా భావిస్తోంది. బౌలర్ల పరంగా పర్వాలేకున్నా.. బ్యాటర్ల పరంగానే జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. బ్యాటర్లు తమ ఆట తీరును మెరుగుపరుచుకుంటేనే భారత్ సిరీస్ గెలిచే అవకాశం ఉంది. లేనిపక్షంలో సిరీస్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా తొలి టెస్ట్ లో విజయం సాధించింది. ఏకంగా 295 రన్స్ తేడాతో విక్టరీ దక్కించుకుంది. కానీ సెకండ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో మనపై గెలుపు సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ సమం అయింది. పెర్త్ టెస్టులో గెలిచిన టీమ్ ఇండియాకు బుమ్రా కెప్టెన్సీ వహించాడు. అడిలైడ్ టెస్ట్ లో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. కానీ అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. భారీ షాట్లు కొట్టలేకపోయాడు. కనీసం క్రీజ్ లో నిలవ లేక పోతున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 4 ఇన్నింగ్స్ లలో హైయెస్ట్ స్కోర్ పది పరుగులు అంటే అతని బ్యాటింగ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మూడు ఇన్నింగ్స్ లలో ఫాస్ట్ బౌలర్ల చేతికి అతడు అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ఇన్నింగ్స్ లలో 3, 6 , 10 రన్స్ చేశాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ సగటు ఒకసారి పరిశీలిస్తే.. 2013 లో 66.60, 2014లో 26.33, 2015 లో 25.07, 2016లో 57.60, 2017లో 217.0, 2018లో 26.28, 2019లో 92.66, 2021 లో 47.68, 2022లో 30.00, 2023లో 41.92, 2024 లో 26.39 సగటును కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నాడు. 12 ఇన్నింగ్స్ లలో అతడు కుడి చేతి వాటమున్న బౌలర్ల పై ఎదురుదాడికి దిగలేదు. కేవలం 106 పరులు మాత్రమే చేశాడు. ఇందులో మొదటి సగటు 11.8 మాత్రమే. పైగా 9సార్లు పాస్ట్ బౌలర్ల చేతిలో అవుట్ అయ్యాడు. ఇక అతడి బ్యాటింగ్ సామర్థ్యం తగ్గిపోయి.. సగటు ప్రతి ఏడాది పడిపోతుంది.

ఇప్పుడు గాయం

ఇక రోహిత్ శర్మ మైదానంలో తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన పూర్వపు లయను అందుకోవడానికి శ్రమిస్తున్నాడు. నెట్స్ లో విపరీతంగా సాధన చేస్తున్నాడు. అయితే అతడు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడు మెల్ బోర్న్ టెస్టులో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది. మరోవైపు ఈ టెస్ట్ ద్వారా ఘనంగా పునరాగమనం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1కి ఆధిపత్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నది. ఐతే జట్టు కెప్టెన్ గాయం బారిన పడటంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. కొంతకాలంగా ఫామ్ లేమి తో బాధపడుతున్న రోహిత్ శర్మ.. మెల్ బోర్న్ టెస్టులో నైనా మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలని భారత అభిమానులు కోరుకుంటుండగా.. హఠాత్తుగా ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. సామర్థ్యాన్ని సాధిస్తేనే అతడు మెల్ బోర్న్ టెస్టులో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. లేనిపక్షంలో బుమ్రా కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular