నటుడు రామ్ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారిన రామ్ అన్నారు. తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్ గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పింది. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని కేవలం మంచి మనస్సు వల్లే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. ఇప్పడు మీ మరణ వార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tragedy in the family of hero ram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com