Junior NTR-Ram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు వాళ్ళ తాత అయిన ‘శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారి కీర్తి ప్రతిష్టలను కాపాడుతూ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను మోస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతానికి ఆయన వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకుని ఆయనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఒకప్పుడు వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఇక అలాంటి సందర్భంలోనే స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ పోతినేని (Ram Pothineni) చేయాల్సిన సినిమాని తన నుంచి లాక్కున్నాడు అంటూ కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు. నిజానికి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ (Ram) ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు డీలాపడ్డాడు.
Also Read : నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?
ఇక ఆ సినిమా దర్శకుడు అయిన సంతోష్ శ్రీనివాస్ (Santhosh Srinivas) దర్శకత్వంలో కందిరీగ 2 (Kandhireega 2) సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కి Ram Pothineni) కి మధ్య గొడవ జరగడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఇక అదే స్టోరీని రభస (Rabhasa) అనే పేరుతో సంతోష్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. మొత్తానికైతే ఎన్టీఆర్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ చేయాల్సిన సినిమాను చేసి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడనే చెప్పాలి…
ఇక ప్రస్తుతం రామ్ పోతినేని సైతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు అనే డైరెక్టర్ డైరెక్షన్లో ‘ఆంధ్ర కింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది