Ram-Bhagyashree Bhorse : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు రామ్ పోతినేని. ఈమధ్య కాలంలో ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పిలవబడే ప్రతీ హీరో పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ లు ఇస్తుండగా, రామ్(Ram Pothineni) మాత్రం సైలెంట్ గా ఉన్నదేంటి అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య కాలంలో రామ్ ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తో డేటింగ్ చేస్తున్నాడంటూ ఒక రూమర్ ఇండస్ట్రీ లో తెగ చక్కర్లు కొట్టింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని స్వయంగా రామ్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse) తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీఎళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని తెలుస్తుంది.
Also Read : సికిందర్’ చిత్రాన్ని మిస్ అయిన తెలుగు హీరో అతనేనా..? భలే తప్పించుకున్నాడుగా!
అయితే కాసేపటి క్రితమే భాగ్య శ్రీ అప్లోడ్ చేసిన ఒక ఫోటోని, రామ్ గతంలో అప్లోడ్ చేసిన ఫోటో తో పోల్చి చూస్తూ వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఫొటోలో భాగ్యశ్రీ ఉన్న ఇల్లు, అదే విధంగా గతంలో రామ్ అప్లోడ్ చేసిన ఫొటోలోని ఇల్లు ఒకేలాగా ఉన్నాయి. గోడపై , అదే విధంగా నేలపై ఉన్న మార్బుల్స్ ని చూసి, ఈమె రామ్ ఇంట్లోనే ఉందని అభిమానులు కనిపెట్టేసారు. చాలా కాలం నుండి వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి కానీ, నేటితో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి పి. మహేష్ బాబు దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మహేష్ బాబు గతంలో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన సంగతి తెలిసిందే.
ఆ డైరెక్టర్ తో రామ్ చేతులు కలపడంతో కచ్చితంగా భారీ హిట్ కొడతాడని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ బాగా దగ్గరయ్యారని, వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం స్నేహం గా మారి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని రామ్ తన ఇంట్లో కూడా మాట్లాడేశాడని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కలిసి ఒకే సినిమాలో పని చేస్తున్నారు కాబట్టి, స్టోరీ చర్చల కోసం భాగ్యశ్రీ రామ్ ఇంటికి వచ్చి ఉండొచ్చు. అంత మాత్రానా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అందుకే పిల్లల్ని కనలేదు..నా మరణం తర్వాత ఆస్తులు వారికే : విజయశాంతి