Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులు ఈరోజు ప్రతికూలమైన వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురు అయినప్పటికీ ఓపికతో ముందుకు వెళ్లాలి. గతంలో అనుకున్న కోరికలు ఈరోజు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంటి నిర్మాణానికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. గురువుల అండదండలతో పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఇదే సమయం లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కాస్త ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద మనశ్శాంతిని లోపిస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో కొందరితో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వెళ్తారు. ఇంట్లో వాతావరణం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని రిస్కులను తీసుకోక తప్పదు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. అయితే సొంత వాహనాలపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి లాభాలు అధికంగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అనవసరంగా వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అయితే చాలా విషయాల్లో ఓపికతో ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి కష్టతరం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల అండదండలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.