https://oktelugu.com/

Photo Story: అమాయకంగా చూస్తున్న ఈ పాప ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్… ఎవరో గుర్తు పట్టారా?

చెన్నైలో పుట్టిన రమ్యకృష్ణ అసలు పేరు రమ్యకృష్ణన్. ఈమె సొంత పరిశ్రమలో కంటే కూడా తెలుగులో అధికంగా చిత్రాలు చేసింది. దానితో రమ్యకృష్ణగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. చాలా మంది రమ్యకృష్ణ తెలుగు అమ్మాయే అనుకుంటారు.

Written By: , Updated On : March 27, 2024 / 05:18 PM IST
Photo Story

Photo Story

Follow us on

Photo Story: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు పాపల్లో ఒకరు స్టార్ హీరోయిన్. సౌత్ ఇండియా మొత్తం ఇరగదీసిన టాప్ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈమె ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటిగా ఉన్నారు. ఇప్పటికే ఆమె ఎవరో మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ క్యూట్ బేబి ఎవరో కాదు రమ్యకృష్ణ.

చెన్నైలో పుట్టిన రమ్యకృష్ణ అసలు పేరు రమ్యకృష్ణన్. ఈమె సొంత పరిశ్రమలో కంటే కూడా తెలుగులో అధికంగా చిత్రాలు చేసింది. దానితో రమ్యకృష్ణగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. చాలా మంది రమ్యకృష్ణ తెలుగు అమ్మాయే అనుకుంటారు. రమ్యకృష్ణ చేసిన కొన్ని పాత్రలు జనాల మదిలో అలా నిలిచిపోయాయి. రమ్యకృష్ణ నటి కావాలనే తపనతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 13 ఏళ్ల వయసులోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. రమ్యకృష్ణ డెబ్యూ మూవీ నేరం పులరంబోల్. ఈ మలయాళ చిత్రం 1986లో విడుదలైంది.

కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. డివోషనల్ చిత్రాలతో పాటు కంటే కూతుర్నే కనాలి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం చేసింది. రమ్యకృష్ణ నటించిన పాత్రల్లో నీలాంబరి ఎవర్ గ్రీన్. రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ చిత్రంలో లేడీ విలన్ గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆ సినిమాకు రమ్యకృష్ణ రోల్ హైలెట్ అని చెప్పాలి.

ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో శివగామిగా రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. శివగామి పాత్రలో ఆమె అదరగొట్టింది. శివగామి పాత్రకు ఆమె తప్ప మరొకరు చేయలేరు అన్నట్లుగా ఆమెకు సెట్ అయ్యింది. ఇటీవల విడుదలైన జైలర్ మూవీలో రజినీకాంత్ భార్యగా నటించి అలరించింది. రమ్యకృష్ణ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కాగా దర్శకుడు కృష్ణవంశీని రమ్యకృష్ణ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి. అయితే వీరిద్దరూ కలిసి జీవిస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడూ జంటగా చూసింది లేదు.