Dreams: రోజంతా అలసిపోయిన వారు కాస్తంత కునుకు తీయాలని కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు గాఢ నిద్రలోకి వెళ్తారు..మరికొందరు కలత నిద్రపోతారు. అంటే ఈ రకంగా నిద్రపోయిన వారు కళ్లు మూసుకున్నా సరైన నిద్ర పట్టదు. మరికొందరు గాఢ నిద్రలోకి జారుకున్నా ప్రశాంత నిద్ర ఉండదు. పడుకున్న ఆ సమయంలో ఏవేవో కలలు వస్తుంటాయి. అయితే కొందరికి రకరకాల కలలువస్తుంటాయి. తాము ఏదో కోల్పోయినట్లు.. తమలను ఎవరో బాధపెట్టినట్లు కలలు వస్తుంటాయి. కొందరు విచిత్రంగా నగ్నంగా ఉన్నట్లు కలలు వస్తుంటాయని చెబుతుంటారు. కలలు ఇలా ఎందుకు వస్తాయంటే?
నిద్రించే సమయంలో నగ్నంగా కలలు రావడం అంటే వారి జీవితంలో ఏదో జరుగుతున్నట్లు లెక్క. సాధారణంగా రోజంతా జరిగిన కొన్ని పనులే రాత్రి కలల సమయంలో మళ్లీ రిపీట అవుతూ ఉంటాయని కొందరు అంటారు. కానీ చాలా మందికి తమ ప్రదేశంతో,తాము చేసే పనులతో సంబంధం లేని కలలు వస్తుంటాయి. అలాంటి పనులు తాము చేయకున్నా ఈ కలలు ఎందుకువచ్చాయి? అని తీవ్ర మనోవేదనకు గురవుతారు. వీటిలో నగ్నంగా ఉండే కలలు ఎందుకు వస్తాయి అంటే?
కొందరికి పదిమందిలోనగ్నంగా ఉన్న కలలు వస్తుంటాయి. ఇది చాలా రేర్ గా జరుగుతుంది. ఈ కల రావడానికి కారణం ఏదో తప్పు చేయబోతున్నారని, ఆ తతప్పు చేయకుండా ఉండడానికి, జాగ్రత్తలు చెప్పేందుకు ఇలాంటి కలలు వస్తుంటాయి. మరి కొందరికి తాము చేస్తున్న పని ప్రదేశంలోనగ్నంగా ఉన్నట్లు కలలు వస్తుంటాయి. ఇలా కలలు వస్తున్నాయంటే ఏదోబాధలో ఉన్నారని అర్థం. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి.
కొందరికి పీడ కలలు, మరికందరికి హాయినిగొలిపే కలలు వస్తుంటాయి. అయితే అందమైన కలలు మనసుకు ప్రశాంతతనుఇస్తాయి. పీడ కలలు ఆవేదనను మిగిలిస్తాయి. అసలు కలలు రాకుండా ఉండాలంటేపడుకునే ముందు కొన్ని పనులు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా మంచి పుస్తకం లేదా మెడిటేషన్ చేసి పడుకోవడం ద్వారా ఎలాంటి కలలు రావని అంటున్నారు. ముఖ్యంగా నిద్రించే ముందు మొబైల్ కు దూరంగా ఉండాలని అంటున్నారు.