Brahmanandam Assets: బ్రహ్మానందం.. ఈ పేరు తెలియని వారుండరు. తన హాస్యంతో తెలుగువారిని అలరించిన బ్రహ్మానందం ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించడం తో పాటు ప్రేక్షకులను అనేకంగా సంపాదించారు. కామెడీ టైమింగ్ తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. కొత్త సినిమా వస్తుంది అంటే బ్రహ్మానందం పాత్ర ఉంటుంది అని అంతా ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. తన వయసు దృష్టా సినిమాలు చేయకుండా ఉంటున్నారు. లేదా బ్రహ్మానందం టైమింగ్, రైమింగ్ కామెడీకి ఛాన్స్ లు రావు అనే ఛాన్సే లేదు అంటున్నారు ఆయన అభిమానులు. ఇలా తన హాస్య నటనతో తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్న హాస్య బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న బ్రహ్మానందం కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా బ్రహ్మానందం ఎక్కువ సినిమాలలో నటించలేకపోతున్నాడు. అయినప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్రహ్మానందం ఎంత ఆస్తులు సంపాదించాడు. ఎంత కూడబెట్టాడు అనే వివరాలపై అందరికీ ఆసక్తి ఎక్కువే.
బ్రహ్మానందం మొదట తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహించేవాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావటంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహనా పెళ్లంట సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి బ్రహ్మానందానికి కామెడీ పాత్రలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.గతంలో ప్రతి సినిమాలో ఈయన కామెడీ ఉండేది. అంతలా ఈయన కామెడీకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఇప్పటికీ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు బ్రహ్మానందం.
ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన బ్రహ్మానందం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండేది. ఒకానొక సందర్భంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు. బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కి దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడట. ఇలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం తన పారితోషికాన్ని సగం భూములపై ఇన్వెస్ట్ చేశారట. ఇలా ఆయన పొదుపు చేసిన స్థిర, చరాస్తులు అన్ని కలిపితే దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. అంతేకాదు డబ్బు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించడంతో పాటు మరే దురలవాట్లు లేని కారణంగా బ్రహ్మానందం వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.