
కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వ్యాక్సిన్లు ఇవ్వదు.. కొనడానికి అవకాశం ఇవ్వదన్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనేలా కేంద్రం తీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అంశాన్ని కేంద్రమే నిర్ణయించడం సరికాదని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఎన్ని టీకాలో ఇవ్వాలో ఆ 2 కంపెనీలకు కేంద్రమే చెబుతోందని హరీష్ అన్నారు. దేశంలో డబ్బు పెట్టినా వ్యాక్సిన్లు కొనలేని పరిస్థితి ఉందన్నారు.