
ఏపీ ప్రభుత్వం పై జాతీయ మావన హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో ఎన్ హెచ్ఆర్సీ అసహనం వ్యక్తం చేసింది. నివేదిక ఎందుకు జాప్యం అపుతోందని ఏపీని ఎన్ హెచ్ఆర్సీ నిలదీసింది. రఘురామ ఫిర్యాదు మేరకు ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి ఎన్ హెచ్ఆర్సీ సమన్లు జారీ చేసింది.