https://oktelugu.com/

ప్చ్.. వ్యాక్సిన్ కోసం వచ్చి ఎక్స్ పోజింగ్ ఏమిటో !

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కంప్లీట్ గా రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వ్యాక్సిన్ కోసం వచ్చిన ఈ ముదురు భామ అక్కడ కూడా అందాల విందుకు తెర లేపింది. ఎద భాగాలను ఆరబోస్తూ హాట్ ఫోజులతో హీట్ పెంచుతుంది. వయసు అయిపోతున్న ఎక్స్ పోజింగ్ చేయడానికి మలైకా ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు పోతుంది. మలైకా వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. అయినా ఈ రేంజ్ […]

Written By:
  • admin
  • , Updated On : June 29, 2021 / 04:57 PM IST
    Follow us on

    బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కంప్లీట్ గా రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వ్యాక్సిన్ కోసం వచ్చిన ఈ ముదురు భామ అక్కడ కూడా అందాల విందుకు తెర లేపింది. ఎద భాగాలను ఆరబోస్తూ హాట్ ఫోజులతో హీట్ పెంచుతుంది. వయసు అయిపోతున్న ఎక్స్ పోజింగ్ చేయడానికి మలైకా ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు పోతుంది.

    మలైకా వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. అయినా ఈ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోస్తూ రెచ్చిపోతుంది అంటే.. అది ఒక్క మలైకాకే సాధ్యం అయింది అనుకోవాలి. ఇక చాలా రోజుల క్రితమే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకొంది మలైకా. ఈ రోజు ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ నిర్వహిస్తోన్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి మరీ రెండో డోస్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ వ్యాక్సిన్ సమయంలోనూ ఎక్స్ పోజింగ్ ఏమిటో !

    అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. హీరో, హీరోయిన్లందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ లు తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ.. ప్రజలను వ్యాక్సిన్ ను తీసుకోమని చెబుతున్నారు. కానీ మలైక మాత్రం గవర్నమెంట్ క్లినిక్ లోనే వ్యాక్సిన్ తీసుకొని.. నా వ్యాక్సిన్ పూర్తి అయింది. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి అంటూ పేద ప్రజలను ఉద్దేశించి చెబుతుంది.

    ఇక మలైక ప్రస్తుతం తనకన్నా 11 ఏళ్ళు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతూ ఏకంగా అతనితో సహజీవనం చేస్తోంది. ఇక ఈ ముదురు భామ ఆ యంగ్ హీరోతో పెళ్లి గురించి ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి గాని, ప్రస్తుతానికి అయితే మలైకా పెళ్లి మాట ఎత్తడం లేదు.