
శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు శనివారం వేకువజామున చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. గమనించిన తోటి మత్స్యకారులు గాలించగా జాలరి గణేశ్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.