https://oktelugu.com/

Viral: గోవాలో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు గోవాకు షిఫ్ట్ అయ్యారు. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారివారి పాట’ చిత్రం షూటింగ్ కోసం తాజాగా గోవాకు చేరుకున్నారు. మొదటి షెడ్యూల్ దుబాయ్ లో కాగా.. హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా మూడో షెడ్యూల్ కోసం ‘సర్కారివారి పాట’ టీం గోవాకు వెళ్లింది. ఈ షెడ్యూల్ ను ప్రారంభించారు. తాజా షెడ్యూల్ లో ‘రామ్-లక్ష్మణ్’ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2021 / 10:15 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు గోవాకు షిఫ్ట్ అయ్యారు. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారివారి పాట’ చిత్రం షూటింగ్ కోసం తాజాగా గోవాకు చేరుకున్నారు.

    మొదటి షెడ్యూల్ దుబాయ్ లో కాగా.. హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా మూడో షెడ్యూల్ కోసం ‘సర్కారివారి పాట’ టీం గోవాకు వెళ్లింది. ఈ షెడ్యూల్ ను ప్రారంభించారు.

    తాజా షెడ్యూల్ లో ‘రామ్-లక్ష్మణ్’ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఇక గోవాలోనే ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ఒక పెద్ద సెట్ నిర్మించారు.

    ఈ క్రమంలోనే ఆన్ లోకేషన్ లో మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురాం, స్టంట్ మాస్టర్ లతో చర్చిస్తున్న ఫొటో వైరల్ గా మారింది.

    యాక్షన్, రోమాన్స్, ఇతర ఎలిమెంట్స్ తో మంచి డోస్ ఉన్న వినోధబరిత చిత్రంగా ఇది ఉంటుందని చూస్తే అర్థమవుతోంది. సినిమా బ్లాస్టర్ టీజర్ ఇప్పటికే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది.

    మైత్రీ మేకర్స్ , జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ , 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ ‘సర్కారివారి పాట’లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.