
దర్శకధీరుడు రాజమౌళి తన మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ఇక నుంచి చేసిన హీరోలతో కాకుండా విభిన్నమైన స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. రాజమౌళి చాలా వరకు ఒకసారి పనిచేసిన హీరోలతోనే మరోసారి సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ‘బాహుబలి’, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోనూ హీరోలు అలా ఇదివరకు చేసిన వారే.. ఇప్పుడు ఈ ఫార్మాట్ కు స్వస్తి చెప్పి ఇతర అగ్రహీరోలను లైన్లో పెట్టడానికి రెడీ అయ్యారు.
ఇప్పటికే ప్రభాస్ తో రాజమౌళి ‘ఛత్రపతి’, బాహుబలి1, బాహుబలి2 తీశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు, రాంచరణ్ తో రెండు సినిమాలు చేశాడు. దీంతో చేసిన హీరోలతోనే రాజమౌళి చేస్తాడన్న విమర్శ ఉంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యాక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయనున్నాడు.
రాజమౌళితో కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం ఎన్ని సంవత్సరాలైన డేట్స్ ఇచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం తెలుగు హీరోలతోనే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి తలుచుకుంటే బాలీవుడ్ అగ్రహీరోలంతా క్యూ కట్టగలరు. జాతీయ మార్కెట్ కూడా రాజమౌళికి బోలెడు ఉంది. కానీ అలా చేయడం లేదు. నెక్ట్స్ సినిమా మహేష్ బాబుతోనే తీయనున్నాడు.
ఇక మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా తీయాలని రాజమౌళి అనుకుంటున్నారు. బన్నీ టాలెంట్ కు రాజమౌళి చాలా సార్లు ఫ్యాన్ అయిపోయాడు. అతడి డ్యాన్స్, యాక్టింగ్, జోష్ రాజమౌళికి చాలా ఇష్టమట.. అయితే బన్నీకి సరిపడా కథను అటు రాజమౌళి, ఇటు విజయేంద్రప్రసాద్ లు సెట్ చేయలేకపోతున్నారట.. ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారుతోన్న అల్లు అర్జున్ ఆ తర్వాత రాజమౌళితో చేస్తే ఇక వేరే లెవెల్ కు వెళ్లిపోతాడు. ప్రస్తుతానికి రాజమౌళి డైరీలో తెలుగు హీరోలు తప్ప వేరే హీరోలు లేనట్లే అని తెలుస్తోంది.