
అగ్రరాజ్యం అమెరికాలో కలకలం రేపిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసు పై విచారణ జరిపిన 12 మంది జ్యూరీ సభ్యుల న్యాయస్థాయం డెరెక్ ను దోషిగా తేల్చింది. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, మ్యాన్ స్లాటర్ నేరాలు చేసినట్లు పేర్కొన్న కోరు డెరెక్ కు వేసే శిక్షను మాత్రం వెల్లడించలేదు. అయితే డెరెక్ శిక్షను జూన్ 16 ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.