Site icon OkTelugu

Fuel Price Hike India 2026: ధరల తుఫాను.. రెండు వారాల్లో సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం!

India Fuel Supply 60 Days Stock

India Fuel Supply 60 Days Stock

Fuel Price Hike India 2026: ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడం, గల్ఫ్‌ దేశాల్లోయిని ఆయిల్‌ రిఫైనరీలు, ఎల్‌పీజీ కంపెనీలపై ఇరాన్‌ చేస్తున్న దాడులతో క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలో అన్ని దేశాలు ఆయిల్‌ ధరలు పెంచుతున్నాయి. మన దేశంలో గ్యాస్‌ ధర పెరిగింది. మరోవైపు వంటనూనెతోపాటు చాలా రకాల వస్తువులపై యుద్ధం ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇది ప్రజల జీవన ఖర్చులను మరింత భారపడేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది.రెండు వారాల్లోనే అనేక కీలక ఉత్పత్తులు, సేవల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావాల వల్లేనా, లేక ఇతర కారణాలా అనే చర్చకు దారితీసింది.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

ధరలె పెరిగిన వి ఇవీ..
కాంగ్రెస్‌ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య సిలిండర్‌ ధర రూ.100కుపైగా పెరిగింది. గృహ సిలిండర్‌ ధర రూ.60 పెరిగింది. వంట నూనెల ధర రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగింది. పారిశ్రామిక డీజిల్‌ లీటర్‌కు రూ.20కిపైగా పెరిగింది. అధిక గ్రేడ్‌ పెట్రోల్‌ లీటర్‌కు రూ.2కుపైగా పెరిగింది. ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌లు ఆర్డర్‌కు రూ.2 పెంచాయి. విమాన చార్జీలు రూ.400 నుంచి రూ.2,000 వరకు పెరిగాయి. ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ సెట్‌కు రూ.30–50 వరకు పెరిగింది. కుకింగ్‌ అప్లయన్స్‌లు (ఇండక్షన్‌) ధరలు 35–45% పెరిగాయి. ఇవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి,

ఎందుకు పెరిగాయంటే..
అంతర్జాతీయ ఆయిల్‌ ధరలు, డాలర్‌ విలువ పెరగడం, రూపాయి విలువ పతనం. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు. ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీలు, సబ్సిడీలు తగ్గించడం వల్ల కూడా ప్రజలపై భారం పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపణ. మరోవైపు, గ్లోబల్‌ సప్లై చైన్‌ సమస్యలు, ఇన్‌ఫ్లేషన్‌ ఒత్తిడి కూడా పాత్ర వహిస్తున్నాయి. రెండేళ్లలో ఇలాంటి ట్రెండ్‌ కొనసాగుతోంది.

ప్రజలపై ప్రభావం
ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు, కానీ మునుపటి సందర్భాల్లో ట్యాక్స్‌ కట్స్, సబ్సిడీలు ప్రకటించింది. అయితే, ఇది తాత్కాలిక పరిష్కారాలేనని విమర్శకులు అంటున్నారు. ప్రజలు ఇప్పటికే కిచెన్‌ బడ్జెట్‌లు దెబ్బతింటున్నాయి. ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం లాంగ్‌–టర్మ్‌ విధానాలు అవసరం. లేదంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకావం ఉంటుంది.

Exit mobile version