ప్రపంచంలో కరోనా వాక్సిన్ భారీగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మన దేశం నుంచి చాలా దేశాలకు కరోనా ఎగుమతి చేస్తోది. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు భారీదగా ఉండటం, వ్యాక్సిన్ ముడిసరుకుల కొరత కారణంగా దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం దిగజారింది. దీనిపై జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ మాట్లాడారు. యూరోపియన్ దేశాలన్ని కలిసి భారత్ ను భారీ ఉత్పత్తిదారుని చేశాయని ఆమె చెప్పారు. భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో జర్మనీకి వ్యాక్సిన్ అందుతుందా? అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.